ఆ అభ్యర్దులకి ఓటెందుకు వేయాలి – దేవినేని ఉమా

Sunday, February 7th, 2021, 10:00:16 PM IST

తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల పై దాడి చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను బెదిరించేలా వ్యాఖ్యలు చేసిన మంత్రుల పై చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. అయితే మోడీ మరియు అమిత్ షా లతో జరిగిన భేటీలో లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు పరిశ్రమ ను తాకట్టు పెట్టారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

అయితే సీఎం జగన్ వారితో జరిగిన సమావేశాల వివరాలను వెల్లడించాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. అంతేకాక వైసీపీ బలపరిచిన అభ్యర్డులకు ఎందుకు ఓటేయ్యాలి అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే అమరావతి ఉద్యమం లో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోతే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు అంటూ విమర్శించారు. అయితే విశాఖ ను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలతో చర్చలు జరుపుతుంటే వైసీపీ కి చెందిన ఎంపీ లు ఏం చేస్తున్నారు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ధాన్యం విక్రయించిన రైతులకు మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అని పేర్కొన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్న మంత్రులను బర్తరఫ్ చేయాలి అంటూ దేవినేని ఉమా రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.