సంపద సృష్టించలేక రాష్ట్రాన్ని హోల్ సేల్ గా అమ్మేస్తున్నారు – దేవినేని ఉమా

Wednesday, June 9th, 2021, 03:05:57 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వైసీపీ పాలనా విధానం పై తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు వరుస విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అయితే మరోమారు తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా వైసీపీ ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే 9 వేల కోట్ల రూపాయల విలువ చేసే 1800 ఎకరాలను 645 కోట్ల రూపాయలకే కట్టబెడుతున్నారు అంటూ దేవినేని ఉమా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే సంపద సృష్టించలేక రాష్ట్రాన్ని హోల్ సేల్ గా అమ్మేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు మరియు పెట్టుబడులు వెనక్కి పంపిస్తూ భూములు దోచుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వ ఆస్తులు, భూములు వాటాలు వేయడానికేనా ఒక్క ఛాన్స్ అడిగింది అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నించారు.

అయితే రాష్ట్రంలోని పలు సమస్యల పై అధికార పార్టీ వైసీపీ ను నిలదీస్తున్నారు దేవినేని ఉమా. అయితే ఇప్పుడు ఈ అంశం పై ప్రస్తావించడం పట్ల వైసీపీ కి చెందిన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే నెటిజన్లు మాత్రం దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యల కి సానుకూలం గా స్పందిస్తున్నారు.