ప్రత్యేక హోదా ఎందుకు తేవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పండి – దేవినేని ఉమా

Friday, February 26th, 2021, 05:32:22 PM IST

అధికార పార్టీ వైసీపీ పై మరోమారు తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం లో పురోగతి లేదు అని, అమరావతి ను ఆపేశారు అని, ప్రత్యేక హోదా ఊసే లేదు అని, 21 నెలల వైసీపీ పాలనలో అభివృద్ధి మర్చిపోయారు అంటూ దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఉద్యోగాలు కావాలంటే ప్రత్యేక హోదా రావాల్సిందే అని, మెడలు వంచి తెస్తామని చెప్పి, నేడు 28 మంది ఎంపి లు ఉండి ఎందుకు ప్రత్యేక హోదా తేవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పండి అంటూ దేవినేని ఉమా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ను సూటిగా ప్రశ్నించారు.

అయితే సార్వత్రిక ఎన్నికల సమయం లో ప్రత్యేక హోదా విషయం పై గళమెత్తిన వైసీపీ, నేడు ఆ ప్రత్యేక హోదా ను తేవడం లో విఫలం అవుతుండటం తో టీడీపీ నేతలు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు విషయం లో కానీ, అమరావతి విషయం లో కానీ వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు మరోమారు హాట్ టాపిక్ గా మారాయి.