కొడాలి నానికి చదువుతో పాటు సంస్కారం కూడా లేదు

Wednesday, January 20th, 2021, 07:46:29 AM IST

నిరసన దీక్ష చేపట్టిన దేవినేని ఉమా ను అరెస్ట్ చేయడం పట్ల తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే పమిడముక్కల పోలీస్ స్టేషన్ నుండి విడుదల అయిన దేవినేని ఉమా మీడియా సమావేశం లో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ తీరు ను ఎండగడుతూ ఘాటు విమర్శలు చేశారు. కొడాలి నానికి చదువుతో పాటు సంస్కారం కూడా లేదు అని విమర్శించారు. బాధ్యతారాహిత్యంగా, సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే కొడాలి నాని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై వరుస విమర్శలు చేస్తున్న నేపథ్యం లో దేవినేని ఉమా ఆ వ్యాఖ్యలకు స్పందించారు. నాని తీరును తప్పుబట్టారు.

పెద్ద వయసు అని చూడకుండా, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటుగా టీడీపీ నేతలను ఆదిపోసుకుంటున్నారు అని అన్నారు. అయితే తాను నిరసన దీక్ష చేపడతానని అంటే వందలాది పోలీసులు తమను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు అని ఉమా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి ని ఎవరు చంపారు అంటూ మరోమారు సూటిగా ప్రశ్నించారు. సీబీఐ విచారణ కోరి ఎందుకు పారిపోయారు అంటూ వరుస ప్రశ్నలు గుప్పించారు. ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ నిలదీశారు. అయితే మంత్రుల బూతులకి, తప్పుడు కేసులకు కార్యకర్తలు భయపడరు అని అన్నారు.