“చేతులెత్తి మొక్కుతాం… చేలను తడపండి” అంటున్న రైతులు…ఈ దుస్థికి కారణం ఎవరు?

Thursday, September 10th, 2020, 03:13:13 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సాగునీరు అందడం లేదు అని, పంటలు ఎండిపోతున్నాయి అని, పట్టించుకొనే నాథుడే లేడు అంటున్న రైతుల ఆవేదన ను తెలుగు దేశం పార్టీ కి చెందిన నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. శ్రీకాకుళం మడ్డువలసలో చేతులెత్తి మోక్కుతాం చేల ను తడపండి అంటూ చేతులు జోడించి వేడుకుంటున్నారు రైతులు అని ఉమా తెలిపారు.

అయితే రైతులకు ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెబుతుంది అని సూటిగా ప్రశ్నించారు దేవినేని ఉమా. రైతుల యొక్క ఈ దుస్థికి కారణం ప్రభుత్వ నీటి నిర్వహణ అసమర్థ అంటూ పరోక్షంగా చ్ జగన్ మోహన్ రెడ్డి పాలన పై ఘాటు విమర్శలు చేశారు. జగన్ ను నిలదీస్తూ చేసిన ఈ పోస్ట్ పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. ఓటు వేసే ముందు ఇవి ఆలోచించు కోవాలి అని కొందరు, వర్షాలు పడకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది అని మరి కొందరు, ఇంకొందరు మాత్రం ఇటువంటి వాటిని ప్రభుత్వం పట్టించుకోదు అని అంటున్నారు.