ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసేలా లైట్లు ఆపి అర్థరాత్రి కౌంటింగ్ – దేవినేని ఉమా

Monday, February 22nd, 2021, 03:31:27 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో జరిగిన పంచాయతీ ఎన్నికల పట్ల తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రజాస్వామ్యం ను ఖూనీ చేసేలా లైట్లు ఆపి అర్థరాత్రి కౌంటింగ్ అంటూ దేవినేని ఉమా సంచలన ఆరోపణలు చేశారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్థులకు 3 డిజిట్ మెజారిటీ వచ్చినా రీ కౌంటింగ్ చేయించారు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే వైసీపీ కి ఒక్క ఓటు వచ్చినా రీ కౌంటింగ్ కి అనుమతి ఇవ్వలేదు అంటూ దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఫలితాలు తారు మారు చేసేందుకే మైనర్ పంచాయితీ ఫలితాలు సైతం రాత్రి 10 గంటల వరకు ప్రకటించనీ మాట వాస్తవం కాదా అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి దేవినేని ఉమా సూటి ప్రశ్న వేశారు.