సీఎం జగన్ తీరు పై దేవినేని ఉమా ఆగ్రహం…మరొకసారి సంచలన వ్యాఖ్యలు!

Thursday, February 4th, 2021, 03:09:03 PM IST

Jagan_Uma

తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మరొకసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 6 వేల కోట్ల రూపాయల సిలికా గనుల పై పెద్దల కన్ను అంటూ దేవినేని ఉమా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలలో సాయం చేసిన పక్క రాష్ట్రం వ్యాపారికి అప్పగించేందుకు రంగం సిద్దం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మేం చెప్పినవారికి ఇవ్వండి లేకపోతే మిమ్మల్ని తవ్వుకొనివ్వం అంటూ గనుల యజమానులకు బెదిరింపులు అంటూ దేవినేని ఉమా సోషల్ మీడియా వేదిక గా వెల్లడించారు. అయితే వేల కోట్ల రూపాయల రాష్ట్ర సంపద కట్టబెట్టాలని అనుకుంటున్న పక్క రాష్ట్ర బంధువు ఎవరు చెప్పండి అంటూ దేవినేని ఉమా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న వేశారు.

అయితే మరొక ట్వీట్ లో వైసీపీ నేతలను వెంటాడుతున్న భయం అంటూ చెప్పుకొచ్చారు. అయితే మా సర్పంచ్ లు, మా వార్డ్ సభ్యులను గెలిపించకపోతే, ఏ పనులు చెయ్యం, మమ్మల్ని గెలిపిస్తే నే ఇళ్ళ పట్టాలు అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం పై దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. మైలవరం లో వాలంటీర్ లను ఇళ్లకు పంపి జోరుగా ప్రలోభాలు అంటూ దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మద్యం, డబ్బు, ప్రలోభాలతోఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న మాట వాస్తవం కాదా అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి నీ ప్రశ్నించారు.