సీఎం జగన్ పై ఫైర్ అయిన దేవినేని ఉమా…ఎందుకంటే?

Thursday, September 17th, 2020, 01:21:25 AM IST

సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన విధానం పై తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు మొదటి నుండి ఘాటు విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ వైఖరి పై మరొకసారి టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసైన్డ్ భూముల చట్టానికి గండి, ఎవరికి లీజుకు ఇవ్వకూడదు అన్న నియమాలకు మంగళం పాడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటూ దేవినేని ఉమా విమర్శలు చేశారు. 1977 చట్ట సవరణలు ఆర్డినెన్సు, గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ కి భూములు, పేదల భూములకి రక్షణ ఎలా అంటూ సూటిగా ప్రశ్నించారు. రెవెన్యూ వర్గాల విస్మయం అంటూ దేవినేని ఉమా మండిపడ్డారు. సంపద సృష్టి చేతకాక, అప్పులు చేస్తూ, భూములు అమ్మడం ప్రభుత్వం వైఫల్యం కాదా అంటూ అందుకు సంబంధించిన కథనం ను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. దీనికి సమాధానం చెప్పండి అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు.