నన్ను ఇరికించేందుకే సీఐడీ అధికారులు కేసు పెట్టారు – దేవినేని ఉమా

Thursday, April 22nd, 2021, 06:50:53 PM IST


సిఐడి అధికారులు తెలుగు దేశం పార్టీ నేత, మాజి మంత్రి దేవినేని ఉమా పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో ను మార్ఫింగ్ చేసినట్లు తన పై నమోదు అయిన కేసును కొట్టి వేయాలి అంటూ దేవినేని ఉమా హైకోర్ట్ ను ఆశ్రయించారు. అయితే ఆయన వేసిన క్వాష్ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. సిఐడి అధికారులు తనను ఇరికించేందుకు కేసు నమోదు చేశారని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే పిటిషనర్ తరపున వాదించిన వాదనలు విన్న అనంతరం హైకోర్ట్ నిర్ణయం తీసుకుంది. అయితే దర్యాప అధికారి ను మార్చాలని ప్రభుత్వం కి ఆదేశాలను జారీ చేసింది. అంతేకాక నిబంధన 41 కింద ఆయనకు రక్షణ కల్పించాలి అని సూచించింది.

అయితే ఈ నెల 29 వ తేదీన మంగళగిరి లోని సీఐడీ ప్రధాన కార్యాలయం లో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలి అంటూ దేవినేని ఉమా కి ఆదేశాలను జారీ చేసింది. అయితే తదుపరి విచారణను మే ఏడవ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. అయితే అప్పటి వరకూ కూడా దేవినేని ఉమా పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని సీఐడీ అధికారులకి ఆదేశాలను జారీ చేసింది. అయితే ఇప్పటికే దేవినేని ఉమా వ్యవహరిస్తున్న తీరు పట్ల వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.