టీడీపీ ప్రారంభించిన 62 ప్రాజెక్టులను గాలికొదిలేశారు – దేవినేని ఉమా

Friday, November 13th, 2020, 08:30:08 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రస్తుతం అధికారం లో ఉన్న వైసీపీ పై తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు వరుస విమర్శలు చేస్తూనే ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ను తప్పుబడుతూ వరుస ప్రశ్నలు సందిస్తున్నారు. అయితే వైసీపీ తీరును ఎండగడుతూ టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తోటపల్లి ప్రాజెక్టులను ఎందుకు రద్దు చేశారు అంటూ సూటిగా ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ ప్రారంభించిన 62 ప్రాజెక్టులను గాలికి వదిలేశారు అంటూ మండిపడ్డారు. అంతేకాక వాటిలో మీరు ఎన్నుకొన్న ప్రాజెక్టులలో ఎంత పనిచేశారు అని నిలదీశారు. అయిదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో 63 వేల కోట్ల రూపాయల ను ఖర్చు చేస్తే 17 నెలల మీ రద్దుల ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అంటూ దేవినేని ఉమా నిలదీశారు. అయితే చంద్రబాబు నాయుడు తన పాలనలో పూర్తి చేసిన పలు ప్రాజెక్ట్ వివరాలను దేవినేని ఉమా సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకున్నారు.