ప్రజలకు ఏం సమాధానం చెబుతారు జగన్ – దేవినేని ఉమా

Thursday, November 26th, 2020, 08:00:54 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై తెలుగు దేశం పార్టీ నేతలు వరుస విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. 18 నెలల అధికారం లో నింగిని అంటిన నిత్యావసరాల ధరలు అంటూ దేవినేని ఉమా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పేద మరియు మధ్య తరగతి ప్రజల పై పెను ప్రభావం అంటూ పేర్కొన్నారు. ప్రభుత్వం యొక్క అసమర్ధత నిర్ణయాల తో ఉపాధ కోల్పోయిన ప్రజలు, ఆపై కరోనా వైరస్ మహమ్మారి పరిస్తితి మరింత తీవ్రం అంటూ దేవినేని ఉమా వివరించారు. అయితే ఇలాంటి కీలక సమయం లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం టాక్స్ లు, రేషన్ సరుకుల రెట్లు పెంచింది అంటూ దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే మా జీవనం ఎలా అంటున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారు జగన్ అంటూ దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు. అయితే ఈ ధరల పెంపు కి సంబంధించిన పలు వివరణలు సైతం పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు విమర్శలు చేస్తూ, అధికార పార్టీ కి వరుస ప్రశ్నలు వేస్తున్న దేవినేని ఉమా మరొకసారి వైసీపీ ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల ఆ పార్టీ కి చెందిన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.