అప్పులతో ప్రచారం తప్ప అంగుళం అభివృద్ది లేదు – దేవినేని ఉమా

Thursday, November 19th, 2020, 07:30:51 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ పాలన విధానం పై వరుస ప్రశ్నలు సంధించారు. అప్పులతో ప్రచారం తప్ప అంగుళం అభివృద్ది లేదు అంటూ విమర్శించారు. ఎక్కడ చూసినా బెదిరింపులు, దౌర్జన్యాలు, రాజకీయ కక్ష సాధింపులే అని దేవినేని ఉమా ఆరోపించారు. అమరావతిని చంపేశారు, పోలవరాన్ని ముంచేశారు, 25 మంది ఎంపీ లను ఇస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని అన్నారు, 28 మంది ఎంపీ లు ఉండి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడక పోవడం ప్రజలను వంచించడం కాదా అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ను సూటిగా ప్రశ్నించారు.

అయితే విశాఖ లో అనుమతులు లేకుండానే గెస్ట్ హౌస్ పనులు జరుగుతున్నాయి అని దేవినేని ఉమా పేర్కొన్నారు. స్టేటస్ కో అమలు లో ఉన్నా, భారీ యంత్రాలతో తొట్ల కొండ పై 30 ఎకరాల స్థలాన్ని చదును చేస్తున్న ప్రభుత్వం అంటూ విమర్శించారు. అందుకు సంబంధించిన పలు పనులు జరగడం పట్ల ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజదాని తరలింపు పై స్టేటస్ కో అమలు లో ఉండగా, గెస్ట్ హౌస్ నిర్మాణం ఏ విధంగా చేస్తారు అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక 18 నెలల్లో లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు అని, లక్ష కోట్ల బిల్లుల బకాయిలు చెల్లించలేదు అని తెలిపారు. ప్రజా వేదిక కూల్చివేత, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులతో వేల కోట్ల ప్రజా ధనం వృదా అంటూ దేవినేని ఉమా చెప్పుకొచ్చారు. నేడు జగనన్న సర్వే రాళ్ల పథకం లో 600 కొట్లు సర్వే రాళ్ల కోసమే ఖర్చు పెట్టడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు అని సూటిగా ప్రశ్నించారు.

అయితే మాజీ మంత్రి దేవినేని ఉమా చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో చర్చలకు దారి తీస్తున్నాయి. అయితే మరొకసారి వైసీపీ పై, రాష్ట్ర ప్రభుత్వం పై, పాలన విధానం పై చేసిన వ్యాఖ్యలు, వరుస ప్రశ్నలకి వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.