మీ నిర్లక్ష్య ధోరణితోనే రాష్ట్రంలో కరోనాకి ప్రజలు బలవుతున్నారు జగన్ – దేవినేని ఉమా

Thursday, May 13th, 2021, 03:19:08 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే దేశం లో ఇప్పటికే పాజిటివ్ కేసులు, మరణాలు పెరగడం తో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లను, కర్ఫ్యూ లను విధిస్తున్నాయి. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ లో పగటి పూట కర్ఫ్యూ అమలు లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పాజిటివ్ కేసులు ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. అయితే వైసీపీ పాలనా విధానం పై తెలుగు దేశం పార్టీ కి చెందిన కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మరొకసారి వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ICMR లెక్కల్లో ఆంధ్ర ప్రదేశ్ 23.63 పాజిటివిటి రేటు ఉందని దేవినేని ఉమా పేర్కొన్నారు. అయితే 10 శాతం దాటితే కఠిన ఆంక్షలు విధించాలని నెల క్రిందటే కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే 13 జిల్లాల్లో పాజిటివిటి బోర్డర్ దాటేసింది అని వ్యాఖ్యానించారు. అయితే టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ లో పూర్తి వైఫల్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మీ నిర్లక్ష్య ధోరణి తోనే రాష్ట్రంలో కరోనా కి ప్రజలు బలవుతున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ దేవినేని ఉమా విమర్శించారు. అయితే పాజిటివిటి రేటు పెరగడం పట్ల ఇప్పటికే పలువురు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే దీనికి వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.