జగన్ సర్కార్‌ని వరుస ట్వీట్లతో ఇరుకున పెడుతున్న దేవినేని ఉమ..!

Thursday, August 20th, 2020, 02:45:42 PM IST

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తన వరుస ట్వీట్లతో జగన్ సర్కార్‌ని ఇరుకున పెడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయని, దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో ఏపీ ముందంజలో ఉందని, అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఏపీలో ఎక్కువ కేసులు నమోదవుతున్నట్టు ఆయన వరుస ఆరోపణలు చేస్తున్నారు.

అయితే తాజాగా కరోనా కేసులపై మరోసారి స్పందించిన దేవినేని ఉమ నిన్న ఒక్కరోజే ఏపీలో 9782 కేసులు, 86 మరణాలు నమోదయ్యాయని అన్నారు. కొంత మంది ప్రజా ప్రతినిధులు పక్క రాష్ట్రాల్లో కార్పొరేట్ వైద్యం పొందుతున్నారని, సామాన్య, మధ్యతరగతి వారికి కూడా ఆ స్థాయిలో వైద్యం అందించాలని కోరారు. రాష్ట్రంలో మోత్తం 3,16,000 కేసులు, 3000 మరణాలతో కరోనా కల్లోలం సృష్టిస్తున్నా ఎందుకు నిన్న క్యాబినెట్‌లో చర్చించి ప్రజలకు భరోసా కల్పించలేదని ఆయన ప్రశ్నించారు.