కరోనా వైద్యానికి దూరంగా పల్లెప్రజలు – దేవినేని ఉమా

Monday, May 17th, 2021, 04:14:36 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే పల్లెల్లో వైద్య సౌకర్యాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగడుతూ తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజి మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైద్యానికి దూరంగా పల్లె ప్రజలు ఉన్నారు అని వ్యాఖ్యానించారు. అయితే పదుల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి అని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అనేక పల్లెలు కరోనా తో తల్లడిల్లుతున్నాయి అని వ్యాఖ్యానించారు. అయితే 24 గంటల్లో 24,171 కేసులు అని అవేదన వ్యక్తం చేశారు. రోజుకి 100 కి పైగా మరణాలు నెలలో ఇది రెండవ సారి అంటూ చెప్పుకొచ్చారు. పాజిటివిటి రేటు పై పైకి పోతుంది అని వ్యాఖ్యానించారు. అయితే కక్ష సాధింపు పై పెట్టిన శ్రద్ధ ప్రజల ప్రాణాలు కాపాడటం లో పెట్టండి అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి సూచించారు దేవినేని ఉమా. అయితే రాష్ట్రం లో కరోనా వైరస్ పరిస్థితుల పై, పల్లెల్లో నెలకొన్న పరిస్థితులకు సంబందించి రెండు వార్తలను షేర్ చేశారు.