సైజులు లేని బూట్లు, జిప్పులు లేని బ్యాగులు.. వైసీపీపై దేవినేని ఫైర్..!

Wednesday, November 18th, 2020, 02:12:34 AM IST


వైసీపీ ప్రభుత్వం ఇటీవల ‘జగనన్న విద్యాకానుక’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్ధులకు యూనిఫాం, జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, పుస్తకాలు, నోట్స్ బుక్స్, బ్యాగ్ మొదలైన వాటిని కిట్ల రూపంలో పంపిణీ చేశారు. అయితే దీనిపై స్పందించిన టీడీపీ నేత అస్తవ్యస్తంగా విద్యాకానుక పంపిణీ ప్రారంభమై 40 రోజులైనా పాఠశాలలకు కిట్లు అందలేదని అన్నారు. సైజులు లేని బూట్లు, జిప్పులు లేని బ్యాగులతో విద్యార్థుల అగచాట్లు, నాసిరకం కిట్ల పంపిణీ చేస్తున్నారంటూ తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రచారంపై ఉన్న శ్రద్ధ నాణ్యమైన కిట్ల పంపిణీ చెయ్యడానికి ఎందుకులేదని ప్రశ్నించారు.

ఇక అంతకు ముందు నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రం భూముల గురుంచి మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర గల ఈ భూములపీ పెద్దలకన్ను పడిందని, సొంతభూముల విలువ పెంచుకునేందుకు ప్రతిష్ఠాత్మక సంస్థ తరలింపు, వందలకోట్ల విలువగల 120 ఎకరాలకు ఎసరు, ప్రత్యామ్నాయ భూములు ఉన్నా మెడికల్ కాలేజీ, కలెక్టరేట్ భవనాలు ఎవరి ప్రయోజనాలకోసం అక్కడ నిర్మిస్తున్నారని ప్రశ్నించారు.