చేతకాని దద్దమ్మలు మాట్లాడే మాటలు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు

Saturday, October 10th, 2020, 02:12:35 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన జగనన్న విద్యా కానుక పై వైసీపీ నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే వైసీపీ నేత, దేవినేని అవినాష్ ఈ మేరకు సీఎం జగన్ పాలన పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే, టీడీపీ నేతల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో సీఎం జగన్ పెను మార్పులు తీసుకు వచ్చారు అని, దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు అని అన్నారు. అమ్మ వడి, విద్యా కానుక లాంటి పథకాలతో పేద విద్యార్థులకు అండగా నిలిచారు అని తెలిపారు.

నాడు నేడు తో జగన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పెను మార్పులు తీసుకు రావడమే కాక, రూపు రేఖలు మార్చేస్తున్నారు అని అన్నారు. అయితే సీఎం జగన్ చేస్తున్న మంచి పనులను చూసి టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారు అని అన్నారు. చేతకాని దద్దమ్మలు మాట్లాడే మాటలు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. ప్రజల అధికారం ఇచ్చినప్పుడు విద్యార్థులను పట్టించుకున్నారా అని సూటిగా ప్రశ్నించారు. అమరావతి, దావొస్, స్విట్జర్ లాండ్ అంటూ కాలయాపన చేశారు అంటూ ఆరోపణలు చేశారు. సీఎం జగన్ తీసుకొచ్చిన పథకాల్లో ఒక్కటైన అటువంటిది తీసుకు వచ్చారా అని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు టీడీపీ కి మరింత బుద్ది చెబుతారు అని దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.