కల్లబొల్లి మాటలు చెప్పి క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు

Thursday, October 29th, 2020, 01:05:55 PM IST

తెలుగు దేశం పార్టీ నేతల పై వైసీపీ కీలక నేత దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ తూర్పు నియోజక వర్గం అభివృద్ధి కి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక నిధులను కేటాయించిన విషయాన్ని వెల్లడించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేరుతుంది అంటూ దేవినేని అవినాష్ తెలిపారు.

అయితే పేదలకు కల్లబొల్లి మాటలు చెప్పి క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్న తెలుగు దేశం పార్టీ నాయకులకు రాష్ట్ర ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అంటూ దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తెలుగు దేశం పార్టీ హయం లో పేద ప్రజల కి గృహాలు ఇస్తామని స్థానిక నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు భారీగా డబ్బులు వసూల్ చేశారు అంటూ ఆరోపణలు చేశారు. ఈ మొత్తం వ్యవహారం పై అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ జరిపించాలి అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర అభివృద్ది కి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలను దేవినేని అవినాష్ వివరించారు.