అధికారం లో ఉండగా దుర్గ గుడి ఫ్లై ఓవర్ పూర్తి చేయలేకపోయారు

Tuesday, August 25th, 2020, 01:13:58 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటికే తెలుగు దేశం పార్టీ నేతలు వైసీపీ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విషయం లో కూడా వైసీపీ తీరు ను విమర్శిస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే తాజాగా కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చంశనీయం కాగా, తాజాగా ఈ వ్యవహారం పై వైసీపీ కి చెందిన నాయకుడు అవినాష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం లో ఉండగా దుర్గ గుడి ఫ్లై ఓవర్ పూర్తి చేయలేక పోయారు అని విమర్శించారు. ఇపుడు ప్రారంభానికి సిద్దంగా ఉన్న ఫ్లై ఓవర్ వద్దకు వెళ్లి హడావిడి చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే గత ప్రభుత్వం హయాంలో టీడీపీ నేతలు బీజీపీ నీ విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే అధికారంలో ఉండగా బీజేపీ ను విమర్శించారు, ఇప్పుడు ఏమి నచ్చి వెనకేసుకు వస్తున్నారు అంటూ నిలదీశారు. రెండేళ్ల క్రితం బీజేపీ ను తిట్టిన మీరు ఈ రోజు ఎలా పొగుడుతున్నారు అంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రజలు అంతా కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి చాలా ఆనందం గా ఉన్నారు అని దేవినేని అవినాష్ అన్నారు. ఈ నేపధ్యంలో శాసన రాజధాని అయిన అమరావతి అభివృద్ది కి వైసీపీ కట్టుబడి ఉంది అని అన్నారు. దేవినేని అవినాష్ చేసిన వ్యాఖ్యల పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.