పేదల నుండి డబ్బులు వసూలు చేసింది వాస్తవం కాదా?

Tuesday, November 10th, 2020, 12:50:07 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారు అని కానీ ఇప్పుడు ప్రజల కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి మంచి చేస్తుంటే విమర్శలు చేస్తున్నారు అని, టీవీలో, పేపర్ లలో పడాలని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అంటూ తూర్పు నియోజక వర్గం వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక సీఎం జగన్ 17 నెలల్లో 90 శాతం హామీలను అమలు చేశారు అని చెప్పుకొచ్చారు.

అయితే చంద్రబాబు నాయుడు కట్టిన రిటైనింగ్ వాల్ వలన వరద ముంపు ఆపలేకపోయారు అని, కానీ సీఎం జగన్ ప్రజల కష్టాలు తెలుసుకొని 122 కోట్ల రూపాయల కేటాయించారు అని కొనియాడారు. అంతేకాక పార్టీలు ముఖ్యం కాదు, ప్రజల సమస్యల పరిష్కారం ముఖ్యం అని వైసీపీ కి ఓటు వేయకపోయినా ప్రతి ఒక్కరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలని సీఎం జగన్ ఆన్నారు అని తెలిపారు. టి డ్కో ఇళ్లు పేదలకు ఇవ్వకుండా మోసం చేసింది టీడీపీ నేతలే అన్న విజయం గుర్తు పెట్టుకోవాలి అని, ఎంపీ మరియు ఎమ్మెల్యే ల అనుచరులు, కార్పొరేటర్లు ఇళ్లు ఇస్తామని పేదల నుండి డబ్బులు వసూలు చేసింది వాస్తవం కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు.