దావూద్ ఇంటిని కూల్చలేదు… కానీ కంగనా కార్యాలయాన్ని పడగొట్టారు…ఎందుకు?

Friday, September 11th, 2020, 08:45:56 PM IST

ప్రపంచ దేశాలు కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు కష్ట పడుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ మహమ్మారి భారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా భారత్ లో 90 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రతి రాష్ట్రం లో అందరికీ ఉన్న కామన్ ప్రాబ్లం కరోనా నే. అయితే మహారాష్ట్ర లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కంగనా వర్సెస్ ప్రభుత్వం గా మారింది.

అయితే ముంబై లో కంగనా ఆఫీస్ కూల్చి వేత పై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోరాటం చేయాల్సింది కంగనా తో కాదు, కరోనా తో అంటూ రాష్ట్ర ప్రభుత్వం కి సూచించారు. కంగనా తో చేసే పోరాటం లో సగం శక్తి కరోనా విలయ తాండవం మీద వాడినా మంచి ఫలితం ఉంటుంది అని అన్నారు. అయితే దావూద్ ఇంటిని కూల్చ లేదు, కానీ కంగనా ఆఫీస్ ను కూల్చేశారు ఎందుకు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చంశనీయం గా మారింది.