కాబోయే సీఎం కేటీఆర్ కి శుభాకాంక్షలు – డిప్యూటీ స్పీకర్

Thursday, January 21st, 2021, 02:43:58 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా కేటీఆర్ అంటూ గత కొద్ది రోజులుగా న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈ అంశం పై అధికార పార్టీ తెరాస కి చెందిన నేతలు అనుకూలం గా మాట్లాడుతుండటం ఆసక్తికర విషయం అని చెప్పాలి. ప్రతి పక్ష పార్టీ నేతలు మాత్రం ఈ అంశం పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ లోని రైల్వే కార్మికుల సమావేశం లో కీలక వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే విషయం పై క్లారిటీ ఇచ్చారు. అయితే కార్మికుల తరపున, తెలంగాణ శాసన సభ తరపున కాబోయే సీఎం కేటీఆర్ కి శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు. అయితే కేటీఆర్ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.