వైసీపీకి షాక్.. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మామ రాజీనామా..!

Thursday, February 18th, 2021, 05:12:08 PM IST

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న అధికార పార్టీ వైసీపీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని పావులు కప్దుపుతుంది. ఈ సమయంలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. విజయనగరం జిల్లాకు చెందిన కీలక నేత, డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర రాజు వైసీపీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో కురపాంలో పాముల పుష్ప శ్రీవాణి గెలుపులో శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు కీలకంగా వ్యవహరించారు.

అయితే తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాల వలనే పార్టీకి రాజీనామా చేసినట్టు చెప్పుకొచ్చారు. వైసీపీ పరిపాలనలో అభివృద్ధి ఆగిపోయిందని, వైసీపీకి అనుకూలంగా లేనివారికి పథకాలు అందడం లేదని ఆరోపించారు. అయితే కార్యకర్తలతో చర్చించి అనంతరం ఏ పార్టీలో చేరుతానన్న దానిపై స్పష్టత ఇస్తానని శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు స్పష్టం చేశారు.