ఏపీకి మరో 35 ఏళ్లు జగనే సీఎంగా ఉంటారు.. డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..!

Tuesday, January 19th, 2021, 06:00:49 PM IST

ఏపీ సీఎం జగన్‌పై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి మరో 35 ఏళ్లు ముఖ్యమంత్రిగా సీఎం జగనే ఉంటారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఆయన్ను మళ్ళీ మళ్ళీ సీఎంగా గెలిపిస్తాయని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు 90 శాతానికి పైగా హామీలను అమలుచేసిన ఘనత సీఎం జగన్‌ది అని అన్నారు.

అయితే సీఎం జగన్‌కు రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని అన్నారు. ఏపీ, తెలంగాణలో జగన్‌కు అభిమాన సంఘాలు పెట్టుకుంటున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్పుకొచ్చారు. ఇక పదేళ్ల తర్వాత జగన్ దేశానికి ఏమవుతాడో మీరే చూస్తారని అన్నారు. బీజేపీ ఎన్ని యాత్రలు చేపట్టినా ఏపీకి మరో 35 ఏళ్లపాటు జగనే సీఎంగా ఉంటారని ఇందులో ఏ మాత్రం అనుమానం అవసరం లేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.