అన్యమత ప్రచారం చేయలేదు.. క్లారిటీ ఇచ్చుకున్న ఏపీ డిప్యూటీ సీఎం..!

Sunday, December 27th, 2020, 07:19:30 PM IST

ఏపీ డిప్యూటీ సీఎం తిరుమలలో అన్యమత ప్రచారం చేశారంటూ వస్తున్న వ్యాఖ్యలపై ఆయన క్లారిటీ ఇచ్చుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల మాట్లాడుతూ క్రిస్మస్‌, వైకుంఠ ఏకాదశి పండుగ రోజున వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు.

అయితే దీనిపై విమర్శలు వచ్చిన నేపధ్యంలో నేడు పవిత్రమైన వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ సందర్భంగా తాను మాట్లాడిన దానిపై విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తిరుమలపై తాను ఎలాంటి మత ప్రచారం చేయలేదని అన్నారు. కులాలను పట్టించుకోకుండా పేదవారికి సీఎం జగన్ ఇళ్ల స్థలాలు పంచిపెడుతున్నారని మా ప్రభుత్వానికి ప్రజలందరూ సమానమేనని చెప్పుకొచ్చారు.