హత్యా రాజకీయాలు చేయడంలో టీడీపీ పేటెంట్ పొందింది

Thursday, December 31st, 2020, 07:34:59 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పై డిప్యూటీ సీఎం ఎస్ బి అంజద్ బాషా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హత్యా రాజకీయాలు చేయడంలో టీడీపీ పేటెంట్ పొందింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే వ్యక్తిగత కక్షల కారణంగా ప్రొద్దుటూరు కి చెందిన నందం సుబ్బయ్య హత్యకి గురైతే, చంద్రబాబు, లోకేష్ మరియు ఎల్లో మీడియా కలిసి ప్రభుత్వం హత్య అనడం తగదు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అయితే నందం సుబ్బయ్య టీడీపీ నాయకుడు కావచ్చు కానీ, అతని పై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ లలో 14 కేసులు ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ కేసులు కూడా టీడీపీ హయాంలో నమోదు అయినవే అంటూ తెలిపారు. అయితే రెండు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు అని, అన్ని తెలిసి చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులు నీచ రాజకీయాలు, శవ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో ముద్దాయిలను చంద్రబాబు తన ఇంట్లో ఉంచుకున్నాడు అని, అది నిజం కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే మహనేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారిని క్షమించి వదిలేశారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా ప్రభుత్వానికి, సీఎం కి అంటగట్టడం బాబుకు, లోకేష్ కి నిత్య కృత్యం అయింది అంటూ వ్యాఖ్యానించారు.