చంద్రబాబు ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆళ్లనాని

Sunday, February 23rd, 2020, 11:01:40 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫై డిప్యూటీ ముఖ్యమంత్రి ఆళ్లనాని సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ ప్రభుత్వ హయం లో దళితుల్ని పూర్తిగా అణచివేశారని ఆళ్ల నాని విమర్శలు గుప్పించారు. మీడియా తో ముచ్చటించిన ఆళ్ళనాని టీడీపీ ని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. పేదలకు కనీసం ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వకుండా మోసం చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

అయితే గడిచిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భారీ మెజారిటీ తో గెలిచిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారని ఘాటుగా విమర్శలు చేసారు. అయితే ఈ ఏడాది ఉగాది నాటికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. జగనన్న వసతి దీవెన పథకం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 11.87 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఆళ్ల నాని తెలిపారు.