కాలుష్యంలో ఢిల్లీనే నెంబర్ 1!

Monday, March 2nd, 2015, 10:53:53 AM IST


భూమిపై వాతావరణ కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతున్న నేపధ్యంలో ప్రపంచంలోనే అతధిక ఎయిర్ పొల్యూషన్ కలిగిన దేశంగా భారత్ అగ్రస్థానానికి ఎగబాకింది. కాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తం మీద భారత్ లో 13 నుండి 20 నగరాలు వరకు అత్యధిక పొల్యూషన్ కలిగి ఉన్నాయని, అందులో భారత రాజధాని నగరం న్యూఢిల్లీ కాలుష్యంలో ప్రధమ స్థానాన్ని ఆక్రమించిందని పేర్కొంది.

కాగా ఢిల్లీలో సెకెనుకు 10మైక్రో మీటర్ల సాంద్రతతో గాలి కాలుష్యం అవుతోందని, దీని వలన దీర్ఘకాలిక వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదముందని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇక ఈ సర్వే ప్రకారం ఢిల్లీలో (పీఎం 2.5), జార్ఖండ్(సల్ఫర్ డై ఆక్సైడ్), పశ్చిమ బెంగాల్(నైట్రోజన్ డైఆక్సైడ్) లతో వాయు కాలుష్యంలో అగ్రస్థానాలలో నిలిచాయి. ఇక వాహనాల సంఖ్య పెరగడం, పరిశ్రమల నుండి వెలువడుతున్న వ్యర్ధాలే వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా ఈ సర్వేలో తేలింది. అలాగే 170 దేశాలలో ఈ కాలుష్య పరీక్ష చేపట్టగా చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లను వెనక్కి నెట్టి భారతదేశం ప్రధమ స్థానంలో నిలిచింది.