ఢిల్లీ లో మరొక వారం పాటు లాక్ డౌన్ పొడిగింపు

Sunday, May 9th, 2021, 04:51:51 PM IST


దేశం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఎక్కువగా కొనసాగుతూ ఉండటం తో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. దేశం లో ఎక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరియు మరణాలు నమోదు అవుతున్నా రాష్ట్రాల్లో ఢిల్లీ ఒకటి అని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే లాక్ డౌన్ అమలులో ఉండగా, తాజాగా మరొక వారం పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17 వ తేదీ వరకు లాక్ డౌన్ అమలు లో ఉండనుంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. అయితే ఈ సారి లాక్ డౌన్ మరింత కఠినం గా ఉంటుంది అని తెలిపారు. అయితే రాష్ట్రం లోని మెట్రో సేవలు కూడా పూర్తీ గా నిలిచి పోనున్నాయి అని వ్యాఖ్యానించారు. అయితే ఢిల్లీ లో కాస్త పాజిటివ్ రేటు తగ్గినప్పటికీ లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

అయితే లాక్ డౌన్ సమయం లో ఆరోగ్య మౌలిక వసతులను పెంచేందుకు కృషి చేశామని అన్నారు. అంతేకాక ఆక్సిజన్ కొరతే ప్రధాన అంశం అంటూ స్పష్టం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ సహాయం తో పరిస్తితి కాస్త మెరుగ్గా ఉందని అన్నారు. అయితే ఢిల్లీ లో పాజిటివిటి రేటు 35 శాతం నుండి 23 కి పడిపోయినా, అది కూడా ఎక్కువే అంటూ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.