ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం

Thursday, November 19th, 2020, 04:05:15 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే దేశ రాజధాని అయిన ఢిల్లీ లో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. నిన్న ఒక్కరోజే 130 కి పైగా ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలను కోల్పోయారు. అయితే కరోనా వైరస్ ను అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంతుంది. అయితే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం, బహిరంగ ప్రదేశాల్లో ఏ ఒక్కరైనా మాస్కులు ధరించకుంటే రెండు వేల రూపాయలు జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు అంతా కూడా అప్రమత్తం గా ఉండాలి అని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో పండుగలు, వేడుకలు జరుపుకోవద్దు అని, ఇంటి వద్దనే జరుపుకోవాలి అని సూచించారు.