ఢిల్లీ ప్రభుత్వం తెలంగాణకు రూ.15 కోట్ల సాయం

Tuesday, October 20th, 2020, 01:28:38 PM IST

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ మహ నగర వాసులు అంతా వరదలతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కాలనీలు జల దిగ్బంధం లో చిక్కుకున్నాయి. అయితే ఇప్పటికే వారిని అడుకొనేందుకు సీఎం కేసీఆర్ 550 కోట్ల రూపాయలు తక్షణ సాయం కింద మంజూరు చేయడం జరిగింది. అయితే తమిళనాడు ప్రభుత్వం సైతం పది కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం సైతం సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది.

అయితే భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయన తెలంగాణ రాష్ట్రం లో పునరావాస కార్యక్రమాల కోసం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 15 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించారు.అయితే తెలంగాణ రాష్ట్రం కి సహాయం చేయడం తో ప్రజల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఫోన్ కాల్ లో ధన్యవాదాలు కూడా తెలిపినట్లు తెలుస్తోంది.