కరోనా తో ఆసుపత్రి లో చేరిన ఢిల్లీ డిప్యూటీ సీఎం

Thursday, September 24th, 2020, 01:01:15 AM IST


కరోనా వైరస్ మహమ్మారి భారత్ లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. వేల సంఖ్యలో నమోదు అవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. ఢిల్లీ లో కూడా ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆసుపత్రి లో చేరారు. కరోనా వైరస్ మహమ్మారి సోకడం తో అనారోగ్యం గా ఉండటం తో ఆసుపత్రి లో చేరారు.

ఈ నెల 14 న కరోనా వైరస్ నిర్దారణ కాగా ఐశోలేశన్ లో ఉన్నారు. తీవ్రత ఎక్కువగా ఉండటం తో ఆసుపత్రి లో చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ మహమ్మారి భారిన పడ్డారు. ఢిల్లీ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 2 లక్షల 53 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.