మాస్కులు ధరించడాన్ని ఓ ఉద్యమం గా ఆచరించాలి

Friday, November 6th, 2020, 06:42:33 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత భారత్ లో ఎక్కువగా ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ అంటూ ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఢిల్లీ లో కరోనా థర్డ్ వేవ్ సెకండ్ వేవ్ కన్నా తొందరగా ముగుస్తుంది అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అయితే కరోనా వైరస్ కి ప్రస్తుతం మంది లేదు అని, దాన్ని అరికట్టాలంటే మాస్కులు ధరించడాన్ని ఓ ఉద్యమం గా ఆచరించాలి అని అన్నారు. అయితే ఈ ఏడాది మార్చి లో ఫారిన్ కంట్రీస్ అయిన ఫ్రాన్స్, ఇటలీ బ్రిటన్ నుండి వచ్చిన వారి ద్వారా ఢిల్లీ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది అని అన్నారు. అయితే వారు తిరగడం కారణంగా 32,000 మంది కరోనా వైరస్ భారిన పడ్డారు అని, జూన్ నాటికి దాని సంఖ్య ఇంకా ఎక్కువ అయింది అని తెలిపారు.

ప్రస్తుతం ఢిల్లీ వాసులు చాలా కఠిన పరిస్థితిని ఎదుర్కంటున్నారు అని, ప్రస్తుతం మాస్క్ ధరించడం ఒక్కటే కరోనా కి మందు అని, కానీ చాలామంది మెడలో వెలడ దీయడం, ముక్కు కింది బాగం లో ధరించడం జరుగుతుంది అని అన్నారు. ఇది సరైనది కాదు అని, మాస్క్ వలన ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా మరో ప్రత్యామ్నాయం లేదని గుర్తుంచుకోవాలి అంటూ అరవింద్ కేజ్రీవాల్ సూచించారు.