బిగ్ డిసీషన్: తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా..!

Wednesday, March 24th, 2021, 06:26:42 PM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో నేటి నుంచి విద్యాసంస్థలు మూసి వేస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. క‌రోనా నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొ పాపిరెడ్డి ప్ర‌క‌టించారు. అయితే త్వరలోనే రీషెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు.

ఇదిలా ఉంటే కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల పరిధిలో ఈ నెల 24 నుంచి డిగ్రీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు, ఈ నెల 25 నుంచి తృతీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా ప్రభుత్వం వాయిదా వేసింది. అయితే జేఎన్టీయూ కూడా బీటెక్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించగా ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఈ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.