ప్రభాస్ కి దీపికా పదుకునే స్పెషల్ విషెస్

Friday, October 23rd, 2020, 05:28:37 PM IST

ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాహుబలి సిరీస్ చిత్రాలతో ప్రభాస్ నేషనల్ స్టార్ గా మారిపోయారు. పాన్ ఇండియన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. అయితే ప్రభాస్ కి తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పడుకొనే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

హ్యాపీ బర్త్ డే ప్రభాస్, మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని తెలిపారు, ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని దీపికా పడుకొనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే దీపికా పడుకొనే విషెస్ తెలియజేయడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. అయితే ఈ చిత్రం లో కథానాయికగా దీపికా పదుకునే ను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పాన్ వరల్డ్ సినిమా గా తెరెకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తో తెరకెక్కిస్తుండగా, అమితాబ్ బచ్చన్ సైతం ఈ చిత్రం లో కీలక పాత్ర పోషిస్తున్నారు.