తైవాన్ విమాన ప్రమాదంలో 31కి చేరిన మృతులు!

Thursday, February 5th, 2015, 10:56:15 AM IST


తైవాన్ లో నిన్న జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య గురువారం నాటికి 31కి చేరింది. కాగా ఇంకా 12మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. ఇక ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన 15మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విమానంలో 58మంది ప్రయాణించగా అందులో 31మంది చైనీయులే ఉన్నారు.

కాగా ఉత్తర తైపీలోని సాంగ్ షాన్ విమానాశ్రయం నుండి కిన్మెన్ ద్వీపానికి వెళ్లేందుకు ఐదుగురు సిబ్బంది, 58మంది ప్రయాణికులతో ట్రాన్స్ ఏషియా ‘ఫ్లైట్ జీఈ 235’ విమానం టేక్ ఆఫ్ తీసుకుంది. అయితే బయలుదేరిన కొద్ది నిమిషాలకే విమానం ఒక పక్కకు ఒరిగి ఫ్లైఓవర్ ను ఢీకొట్టడంతో ముందుకు దూసుకెళ్ళి ముక్కలై నదిలో పడిపోయింది. దీనితో వెంటనే అప్రమత్తమైన సహాయక సిబ్బంది ఈ ప్రమాదం నుండి 15మందిని రక్షించగలిగారు.