వరంగల్ జిల్లాలో దారుణం : ఆత్మహత్య చేసుకున్న వలసకూలీలు – కారణం ఏంటంటే…?

Friday, May 22nd, 2020, 01:00:50 PM IST

గత కొంత కాలంగా రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. కాగా ఈ వైరస్ నివారణకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ని చాలా కఠినంగా అమలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో చిక్కుకున్నటువంటి వలస కూలీలు పడుతున్నటువంటి ఇబ్బందులు అంతాఇంతా కాదు. కాగా తాజాగా వరంగల్ రురల్ జిల్లాలోని, గీసుకొండ మండలం గొర్రెకుంట పారిశ్రామిక వాడలో, కోల్‌కతా ప్రాంతానికి చెందిన వలస కార్మికులు స్థానిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే… కోల్‌కతాకు చెందినటువంటి మక్సూద్ అనే వ్యక్తి గత కొంత కాలంగా వరంగల్ అర్బన్ జిల్లాలోని కరీమాబాద్‌లో బార్‌దాన్ కూలీగా పనిచేస్తున్నాడు. తన భార్య, పిల్లలతో కలిసి పారిశ్రామిక వాడలోని సాయిదత్తా బార్‌దాన్‌ ట్రేడర్స్‌లోని భవనంలోనే నివాసముంటున్నారు. అయితే అదే భవనంలో కొందరు బీహార్ యువకులు కూడా నివాసముంటున్నారు. అయితే ఏం జరిగిందో కానీ తెల్లవారేసరికి వారి కుటుంబం అంతా కూడా స్థానిక బావిలో శవాలుగా కనిపించేసరికి అందరు కూడా ఆందోళనకు గురవుతున్నారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు వారి మృతికి సంబందించిన కారణాలను వెతికే పనిలో ఉన్నారు. దానికితోడు అదే భవనంలో ఉంటున్నటువంటి బీహార్ కి చెందిన యువకుల మృతదేహాలుకూడా ఆ ఒక్కొక్కటిగా ఆ భావి నుండి బయటపడుతున్నాయి. వీరి మృతికి గల కారణాలు ఇంతవరకు తెలియరాలేదు.

కాగా ఇప్పటివరకు వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుకొండ మండలం, గొర్రకుంట మండలానికి చెందిన వలస కార్మికులవి దాదాపుగా 9 మంది మృతదేశాలు దొరికాయని పోలీసులు వెల్లడించారు. కాగా వారిలో మక్సూద్ (55), బుష్రా కథూర్(22), షాబాద్ ఆలం(21), 3 ఏళ్ళ బాలిక, శ్రీరామ్(21), నిషాన్(48), శాఖీల్(30), సోహైల్ ఆలం(18), శ్యామ్(20) గా పోలీసులు గుర్తించారు.