దారుణం : వలసకూలీల బస్సు బోల్తా – తీవ్రంగా గాయపడ్డ కూలీలు…

Saturday, May 23rd, 2020, 08:23:55 AM IST

మనదేశంలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్రత దారుణంగా పెరుగుతున్న తరుణంలో, మన ప్రభుత్వాలు అన్ని కలిసి మూకుమ్మడిగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ని చాలా కఠినంగా అమలు చేశాయి. కాగా ఈ లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నటువంటి వలసకార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు అంతాఇంతా కాదు. కాగా అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కరోనా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నటువంటి వలసకూలీలను వారి వారి సొంత ప్రదేశాలకు చేర్చడానికి కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈక్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వలస కార్మికులను తీసుకువెళుతున్న బస్సు బోల్తా పడింది.

కాగా ఈ ఘటనలో దాదాపుగా బస్సులో ఉన్న 24 మంది వలస కూలీలు దారుణంగా గాయపడ్డారు. వారందరిని కూడా ఎస్‌ఆర్‌ఎన్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రస్తుతానికి వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఈ బస్సు జైపూర్ నుండి పశ్చిమ బెంగాల్ వెళుతోంది. సావర్నావాబ్‌గంజ్‌లోని సహవ్‌పూర్ సమీపంలో బస్సు హైవేపై బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్షమే ఈ కారణమని పోలీసులు వెల్లడించారు.