బిగ్ న్యూస్: ఏపీ లో పగటి పూట కర్ఫ్యూ…సీఎం జగన్ కీలక నిర్ణయం!

Monday, May 3rd, 2021, 02:48:47 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఊహించని రీతిలో నిన్న ఒక్క రోజే 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అదే తరహాలో పదుల సంఖ్యలో మృతుల సంఖ్య నమోదు అవుతోంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

బుధవారం నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అన్ని షాపులు తెరుచుకొన వచ్చును. అయితే ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు 144 సెక్షన్ అమలు కానుంది. అయితే 12 తర్వాత అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ బుధవారం అనగా 5 వ తేదీ నుండి రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలు కానున్నాయి.