మహర్షి టీజర్ ను దింపేసిన వార్నర్..!

Thursday, December 31st, 2020, 01:50:21 PM IST

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సన్ రైజర్స్ హైదరాబాద్ కి కెప్టెన్ గా వ్యవహరించిన డేవిడ్ ఈ ఏడాది ఎన్నో తెలుగు చిత్రాలకు సంబంధించిన వీడియోలను చేశారు. అల్లు అర్జున్ బుట్ట బొమ్మ నుండి ప్రభాస్ బాహుబలి వరకు అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఈ ఆస్ట్రేలియా ఆటగాడు ఈ ఏడాది ముగిస్తుండటం తో ఒక వీడియో ను తన అభిమానులతో పంచుకున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను దింపేసాడు డేవిడ్ వార్నర్.

డేవిడ్ వార్నర్ మహర్షి టీజర్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ ఏడాది తెలుగు అభిమానులను విపరీతంగా అలరించిన వార్నర్ మరొక వీడియో పోస్ట్ చేయడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇండియా తో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ అడనున్నట్లు తెలిసిందే.