ఐపియల్ లో డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు!

Wednesday, November 4th, 2020, 03:57:36 PM IST

ఊహించని రీతిలో ఈ ఏడాది ఐపిఎల్ ప్లే ఆఫ్ కి చేరుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ టీమ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ టోర్నీ తో మరొక అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. వరుసగా ఆరు ఐపియల్ సీజన్లలో 500 కి పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా వార్నర్ రికార్డ్ సృష్టించాడు. కీలకమైన ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో వార్నర్ అర్ద శతకం చేసి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు.

అయితే ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ మీదుగా ఉన్న ఈ రికార్డ్ వార్నర్ అధిగమించాడు. 2014 నుండి కనీసం 500 పరుగులు సాధిస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కి విజయ పరంపర లో కీలక పాత్ర పోషించారు. అయితే 2018 లో బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా ఆడలేదు. అయితే అయితే ఈ ఏడాది 529 పరుగులు చేసి, ఆరంజ్ క్యాప్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ సాధించిన విజయం తో ప్లే ఆఫ్ కి చేరుకోగా, ప్రస్తుతం ముంబై ఇండియన్స్, ఢిల్లీ, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ల్లో ఒక టీమ్ విజేతగా నిలవనుంది.