మంత్రి కేటీఆర్‌కు అల్టీమేట్ కౌంటర్ ఇచ్చిన దాసోజు శ్రవణ్..!

Thursday, March 11th, 2021, 04:25:47 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా మద్దతు ప్రకటించారు. అయితే దీనిపై స్పందించిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్ల ఓట్ల కోసమే కేటీఆర్ విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతున్నారు తప్పా నిజంగా ఆయనకు విశాఖ ఉక్కుపై ఎలాంటి ప్రేమ లేదని అన్నారు. కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తిస్తా అన్నట్లు ఉంది కేటీఆర్ మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.

అంతేకాదు నిజాం షుగర్‌ను అమ్ముకున్న వీరు విశాఖ ఉక్కు మీద ఉద్యమం చేస్తాం అంటే ఎవరూ నమ్మరని అన్నారు. ప్రధాని మోదీని చూస్తేనే టీఆర్ఎస్ నేతల లాగులు తడుస్తాయని, ఇలాంటి నేతలు కేంద్రం మీద పోరాటం చేస్తాం అంటే సీమాంధ్రులు నమ్మరని, కేటీఆర్ మాటలు నమ్మి ఓటు వేయడానికి ఆంధ్ర సెటిలర్లు అమాయకులు కాదని దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణలో చాలా సమస్యలున్నాయని, ముందు వాటిని పరిష్కరించాక పక్క రాష్ట్రాల సమస్యలు తీర్చవచ్చు అని కేటీఆర్‌కు దాసోజు శ్రవణ్ సలహా ఇచ్చారు.