మంత్రి గంగుల కమలాకర్ కళ్లు పీకేయండి.. సీఎం కేసీఆర్‌కు దాసోజు డిమాండ్..!

Saturday, October 31st, 2020, 09:33:13 AM IST

తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌పై ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్‌ ఓ మహిళను వేధించి లొందీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే మహిళల్ పట్ల నీచంగా వ్యవహరించిన గంగుల కమలాకర్‌ను వెంటనే మంత్రివర్గం నుంచి భర్తరప్ చేయాలని దాసోజు డిమాండ్ చేశారు.

అంతేకాదు తెలంగాణలో అడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని, పాలకులే రాక్షసులుగా మారి పీడిస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా ఆడపిల్లలవంక చూస్తే వాళ్ల కళ్లు పీకేస్తా అని చెప్పిన సీఎం కేసీఆర్ గంగుల కమలాకర్ కళ్లను ఎందుకు పీకడం లేదని ప్రశ్నించారు. అయితే తెలంగాణ ద్రోహికి మంత్రి పదవి ఇచ్చి అందలం ఎక్కించిన సీఎం కేసీఆర్ ఇప్పుడైన ఆలోచించి తప్పును సరిద్దుకోవాలని అన్నారు.