నక్సలైట్ లలో చేరేందుకు అనుమతి ఇవ్వండి…రాష్ట్రపతి కి లేఖ!

Tuesday, August 11th, 2020, 02:01:26 AM IST


కొద్ది రోజుల క్రితం వైసీపీ నేత ఇసుక లారీలను అడ్డుకోవడం కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో సీతానగరం లోని పోలీస్ స్టేషన్ లో ఒక దళిత యువకుడిని శిరోముండనం చేయించి అవమానించారు. అయితే ఈ ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా పోలీసులను అరెస్ట్ చేయలేదు అని, ఏపీ ప్రభుత్వం, పోలీసుల వలన తనకు న్యాయం జరగలేదు అని, మీరే కలుగజేసుకొని న్యాయం జరిగేలా చూడాలి అని రాష్ట్రపతి కి లేఖ రాశారు. లేదంటే నక్సలైట్ లలో చేరేందుకు అనుమతి ఇవ్వాలి అని లేఖ లో కోరడం జరిగింది.

అయితే ఈ లేఖ పై ప్రతి పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అయితే పాలకుల దుర్మార్గం, అణచివేత, అహంకారం,వివక్షత ఇవన్నీ పెచ్చుమీరితే యువత ఎలా పక్కదారి పడుతిందో చెప్పడానికి ఈ వర ప్రసాద్ అనే దళిత యువకుడు ఉదాహరణ అని అన్నారు. వైసీపీ నేత ఇసుక మాఫియా ను అడ్డుకున్నందుకు సీతానగరం పోలీస్ స్టేషన్ లో ఇతనికి శిరోముండనం చేసి అవమానించారు, ఇంతవరకు న్యాయం జరగలేదు అని చంద్రబాబు నాయుడు అన్నారు.ఫలితంగా నక్సలైట్ గా మారేందుకు అనుమతి ఇవ్వమని రాష్ట్రపతికి లేఖ రాసే పరిస్తితి వచ్చింది అని, అయితే ఇది తెలిసి బాధేసింది అని, ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడి లో ఇటువంటి ఆలోచన వచ్చిందంటే, రాష్ట్రంలో వ్యవస్థలు ఎంత ప్రమాదకరం గా దిగజరాయో ప్రజలు ఆలోచించాలి అని అన్నారు.