గ్రేటర్ ఎన్నికలపై డీఎస్ హాట్ కామెంట్స్..!

Friday, November 20th, 2020, 01:07:43 AM IST


గ్రేటర్ ఎన్నికల నిర్వహణ తీరుపై రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికలు ఓ జిమ్మిక్కని ఆయన అన్నారు. తన ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఏనాడు చూడలేదని అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఆర్ధిక సహాయం అందించి ఆదుకునేది పక్కన పెట్టి ఇలా ఉరుకుల పరుగులతో ఎన్నికలు నిర్వహించడం ఏమిటని అన్నారు.

అయితే గ్రేటర్ ఎన్నికల తీరును చూస్తుంటే ప్రజాస్వామ్య బద్దంగానే ఎన్నికలు జరుగుతున్నాయా అన్న అనుమానం కలుగుతుందని డీఎస్ అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇచ్చిన హామీలపై విశ్వసనీయతను పెంచుకోవాలని, ప్రజలను ఇంకా ఎన్ని సార్లు మభ్యపెడతారని అన్నారు. ప్రజల నుంచి, ప్రతిపక్షాల సూచనలను పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలు పెట్టడం సరికాదన్నారు. టీఆర్ఎస్ పార్టీ తనను పూర్తిగా పక్కన పెట్టిందని కూడా డీఎస్ ఆరోపించారు.