ఏపీ లో నెలాఖరు వరకూ కర్ఫ్యూ పొడిగింపు!

Monday, May 17th, 2021, 03:39:58 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో పాటుగా, మరణాలు సైతం భారీగా నమోదు అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యం లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరు వరకు రాష్ట్రం లో కర్ఫ్యూ ను పొడిగించాలని నిర్ణయించారు. అయితే మెరుగైన ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాల పాటు కర్ఫ్యూ ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి కట్టడి చర్యలకు సంబందించి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి ఆళ్ళ నాని మరియు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కర్ఫ్యూ విధించి కేవలం పది రోజులు మాత్రమే దాటింది అని వ్యాఖ్యానించారు. అయితే రూరల్ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. అయితే వాలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సమావేశం లో అన్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, వారిని ఆదుకొనే విధంగా ఆర్ధిక సహాయం పై తగు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి అని ఆదేశాలను జారీ చేశారు.