బిగ్ షాక్: నారా లోకేశ్‌పై క్రిమినల్ కేసు నమోదు..!

Saturday, May 8th, 2021, 11:00:09 PM IST


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై క్రిమినల్ కేసు నమోదయ్యింది. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై నారా లోకేశ్ సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేశారంటూ, దీనివల్ల ఎమ్మెల్యే గౌరవానికి భంగం వాటిల్లుతుందని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అనంతపురం జిల్లా డి.హిరేహాళ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నారా లోకేశ్‌పై క్రైమ్ నెంబర్.111/2021 అండర్ సెక్షన్ ఐ.పి.సి 153(ఆ),505 అంద్ 506గా కేసు నమోదు చేశారు.

అయితే అసలు ఏం జరిగిందంటే గత నెల 21వ తేదీన అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన టీడీపీ కార్యకర్త మారుతీపై కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా రాంపురం గ్రామం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో మారుతికి గాయాలయ్యాయి. అయితే దీనిపై స్పందించిన లోకేశ్ సోష‌ల్‌మీడియా వేదిక‌గా ఎమ్మెల్యే అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌శ్నిస్తున్నార‌ని గూండాల‌తో దాడి చేయించారని, మారుతికి చెందిన బేకరీని మూసివేయించడంలో విఫలమై అతడిపై ఇలాంటి దాడికి పాల్పడ్డారని విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు.