స్టీవ్ స్మిత్ చేసిన పనికి విమర్శలు గుప్పిస్తున్న క్రికెట్ అభిమానులు

Monday, January 11th, 2021, 05:11:52 PM IST

ఆసీస్ పర్యటనలో ఉన్న భారత్ ప్రస్తుతం టెస్ట్ సీరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు జట్లు చెరొక మ్యాచ్ ను గెలవగా, మూడవ మ్యాచ్ డ్రా అయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ గెలుపు కోసం ఇరు టీమ్ లో బాగా కృషి చేశాయి. అయితే భారీ పరుగుల 407 లక్ష్యం తో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ధీటైన బ్యాటింగ్ చేసి డ్రా గా ముగించింది. అయితే రెండవ ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ ఇన్నింగ్స్ పట్ల ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే మ్యాచ్ గెలవడం కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్ళు ఎంతకైనా తెగిస్తారు అనే దానికి నేడు జరిగిన ఒక సంఘటన ఉదాహరణ గా చెప్పవచ్చు.

ఇప్పటికే బాల్ టాంపరింగ్ వివాదం కారణం గా ఏడాది నిషేధ ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్ మరొకసారి తన చెడ్డ బుద్ది చూపించుకున్నాడు. రహానే తర్వాత క్రీజులో కి వచ్చిన రిషబ్ పంత్ అసాధారణ బ్యాటింగ్ తో టీమ్ ఇండియా ను ఆదుకున్నాడు. అయితే ఆసీస్ బౌలర్లకి చుక్కలు చూపించాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో అదరగొట్టిన రిషబ్ 97 పరుగులు చేసి, సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే పంత్ డ్రింక్స్ తీసుకుంటున్న సమయం లో స్టీవ్ స్మిత్ పంత్ గార్డ్ మార్క్స్ ను చేరిపేసాడు. పంత్ వచ్చిన అనంతరం మళ్లీ గార్డ్స్ పెట్టుకున్నాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ ఘటన పట్ల కామెంటేటర్లు సైతం విమర్శలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ ఘటన పట్ల అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.