దారుణం : కూలిపోయిన విమానం – 9 మంది మృతి

Friday, December 27th, 2019, 10:27:35 AM IST

అప్పుడే గాల్లోకి ఎగిరిన ఒక విమానం, అకస్మాత్తుగా ఒక ఇంటిని ఢీకొట్టి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ విమాన ప్రమాదం వలన దాదాపు 9 మంది మరణించగా, మరికొందరు తీవ్ర గాయాలతో బయటపడ్డారని సమాచారం. కాగా వివరాల్లోకి వెళ్తే… కజకిస్థాన్‌లోని, అల్మాటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి దాదాపుగా వంద మంది ప్రయాణికులతో అప్పుడే బయల్దేరిన బెక్ ఎయిర్ జెట్ విమానం ఒక్కసారిగా కూలిపోయింది. కాగా ఈ ప్రమాదంలో దాదాపుగా 9 మంది చనిపోయినట్లు సమాచారం. కాగా విమానం బయల్దేరిన కొద్దిసేపటికే దాని సిగ్నల్స్ కట్ అయ్యాయనీ, అందువలన ఆ విమానం రెండంతస్థుల భవనంలోకి దూసుకుపోయిందని చెబుతున్నారు.

అయితే రాజధాని నూర్-సుల్తాన్‌ కి బయల్దేరిన ఆ విమానం టేకాఫ్ అవుతున్నసమయంలోనే అది కాంక్రీట్ ఫెన్స్‌ని ఢీకొట్టుకుంటూ వెళ్లడం వలన సిగ్నల్స్ విషయంలో పెద్ద సమస్య ఎదురైందని, ఆ సిగ్నల్స్ సమస్య వల్లే విమానం నేరుగా వెళ్లి, ఓ చిన్న ఇంటిని ఢీకొట్టిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో విమానం మొత్తం ముక్కలవ్వగా, ఆ ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. ఆ ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి…