పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు సీపీఎం మద్ధతు..!

Monday, October 12th, 2020, 06:02:44 PM IST

మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టుభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేయనున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు మద్ధతు ఇవ్వాలని సీపీఎం పార్టీ నిర్ణయించింది. ఇక నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థికి మద్దతును ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు కమ్యూనిస్టు భావాలున్నాయని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు మద్ధతిస్తున్నట్టు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇదిలా ఉంటే తాను పోటీ చేస్తుంది ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే అని చెబుతున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ చెబుతున్నారు. 2007,2009లో ఇదే నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన 2014 వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు.